మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 21, 2020 , 16:17:30

బజాజ్‌ ఫైనాన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగిన రాహుల్‌ బజాజ్‌

బజాజ్‌ ఫైనాన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగిన రాహుల్‌ బజాజ్‌

న్యూఢిల్లీ: బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ పదవి నుంచి రాహుల్ బజాజ్ వైదొలిగారు. ఈ నిర్ణయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ నెలాఖరులో బజాజ్ చైర్మన్ పదవి నుంచి రాహుల్‌ బజాజ్‌ తప్పుకోనున్నారు. అయినప్పటికీ, అతను నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కొనసాగుతారు. నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సంజీవ్ బజాజ్ నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది.

కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాహుల్ బజాజ్.. 1987 లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఐదు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. గ్రూప్, వారసత్వ ప్రణాళికలో భాగంగా 2020 జూలై 3 న చైర్మన్‌ పదవి నుంచి వైదొలగాని నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ  నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కంపెనీకి తన సేవలను కొనసాగిస్తాడు. మంగళవారం జరిగిన బోర్డ్‌ డైరెక్టర్ల సమావేశంలో ప్రస్తుతం కంపెనీ వైస్ చైర్మన్‌గా ఉన్న సంజీవ్ బజాజ్ నియామకాన్ని ఆమోదించింది. రాహుల్ బజాజ్ స్థానంలో 2020 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చే కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సంజీవ్ బజాజ్‌ వ్యవహరిస్తారు. 

బజాజ్‌ ఫైనాన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు రాహుల్‌ బజాజ్‌ ప్రకటించిన తరువాత, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు బీఎస్ఈలో 6.43 శాతం తగ్గి రూ.3,220 కు పడిపోయింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభంలో రూ.962.32 కోట్లకు 19.40 శాతం క్షీణించింది. ఈ షేర్లు ఇప్పటికే రెడ్ పోస్ట్‌లో ట్రేడవుతున్నాయని కంపెనీ ఫలితాలు ప్రకటించాయి.


logo