e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News బ‌జాజ్ ఆటో చైర్మ‌న్ ప‌ద‌వికి రాహుల్ బ‌జాజ్ రాజీనామా

బ‌జాజ్ ఆటో చైర్మ‌న్ ప‌ద‌వికి రాహుల్ బ‌జాజ్ రాజీనామా

బ‌జాజ్ ఆటో చైర్మ‌న్ ప‌ద‌వికి రాహుల్ బ‌జాజ్ రాజీనామా

న్యూఢిల్లీ : ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త రాహుల్ బ‌జాజ్ బ‌జాజ్ ఆటో చైర్మ‌న్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా వైదొలిగారు. మే 1 నుంచి రాహుల్ బ‌జాజ్ చైర్మ‌న్ ఎమిర‌ట‌స్ హోదాలో కొన‌సాగుతారు. బ‌జాజ్ స్ధానంలో కంపెనీ నూత‌న చైర్మ‌న్ గా ప్ర‌స్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ నీర‌జ్ బ‌జాజ్ బాధ్య‌త‌లు చేప‌డ‌తారు. ఐదు ద‌శాభ్దాల‌కు పైబ‌డి కంపెనీకి దిశానిర్ధేశం చేస్తున్న రాహుల్ బ‌జాజ్ వ‌యోభారంతో రాజీనామా చేశార‌ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్ ల‌కు కంపెనీ తెలిపింది.

బ‌జాజ్ గ్రూప్ విజ‌య ప్ర‌స్ధానంలో రాహుల్ బ‌జాజ్ ఐదు ద‌శాబ్ధాలుగా కీల‌క పాత్ర పోషించార‌ని, ఇక ముందూ స‌ల‌హాదారుగా ఆయ‌న అమూల్య స‌ల‌హాలు, సేవ‌లు కంపెనీకి కొన‌సాగుతాయ‌ని బ‌జాజ్ ఆటో పేర్కొంది. ఈ ఏడాది మే 1 నుంచి ఐదేండ్ల పాటు కంపెనీ చైర్మ‌న్ ఎమిర‌ట‌స్ గా సేవ‌లందిస్తార‌ని, ఆయ‌న నియామ‌కానికి బోర్డు భేటీలో ఆమోద‌ముద్ర వేశార‌ని తెలిపింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ‌జాజ్ ఆటో చైర్మ‌న్ ప‌ద‌వికి రాహుల్ బ‌జాజ్ రాజీనామా

ట్రెండింగ్‌

Advertisement