శనివారం 24 అక్టోబర్ 2020
Business - Sep 23, 2020 , 00:50:23

నేను సమయాభావ బాధితుడిని..

నేను సమయాభావ బాధితుడిని..

పీవీ నరసింహారావు సాహిత్యాభిలాష గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 1996లో అవధాని మాడ్గుల ఫణిభూషణశర్మ మహా సహస్రావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానిగా ఉన్నా, ఎన్నికల సమయం దగ్గరపడినా ఆ కార్యక్రమానికి పీవీ ప్రుచ్ఛకులుగా పాల్గొన్నారు. అయితే కొద్దిసేపు మాత్రమే అక్కడ గడిపారు. ఆ సందర్భంగా “కొందరు వరద బాధితులు ఉంటారు. మరికొందరు కరువు బాధితులు ఉంటారు. కానీ నేను మాత్రం సమయాభావ బాధితుడిని. అందువల్లే ఫణిభూషణ్‌శర్మ కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నా” అంటూ పీవీ నరసింహారావు వివరించారు. అంతే కాదు నిద్రావస్థలోనూ ప్రశ్నలే కనిపిస్తున్న తాను ఏ ప్రశ్న వేయాలని చమత్కరించడమే గాక, ఇప్పటికిప్పుడు మీ మనసులోని భావాన్ని పద్యం రూపంలో తెలపాలని అవధాని శర్మకు ప్రశ్న వేయకుండానే ప్రశ్న వేయడం అక్కడ మరో విశేషం.


logo