గురువారం 28 మే 2020
Business - May 08, 2020 , 17:53:23

లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 9,300 పాయింట్ల‌కు నిఫ్టీ

లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 9,300 పాయింట్ల‌కు నిఫ్టీ

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్నిస్వ‌ల్ప‌ లాభాలతో ముగించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నేటి లాభాలను ముందుండి నడిపించింది. జియోలో విస్టా రూ.11,367 కోట్ల పెట్టుబడులు పెడుతోందని రిలయన్స్ ప్రకటించడంతో... ఆ సంస్థ షేర్లు దూసుకుపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 199 పాయింట్లు లాభపడి 31,643కి పెరిగింది. నిఫ్టీ 52 పాయింట్లు పుంజుకుని  9,252 వద్ద స్థిరపడింది. ఫార్మ, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఐటీ, ఇన్ ఫ్రా షేర్లలో కొనుగోళ్లు కనిపించగా ఆటో, బ్యాంకింగ్ , మెటల్  ఫేర్లలో అమ్మకాలు కనిపించాయి. హెచ్‌యుఎల్  టాప్ విన్నర్ గా నిలిచింది. నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా , సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభ‌ప‌డ‌గా..మహీంద్రా అండ్ మహీంద్రా , ఎన్టీపీసీ , యాక్సిస్ బ్యాంక్ , ఇండస్ ఇండ్ బ్యాంక్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు న‌ష్ట‌పోయాయి.logo