బుధవారం 03 మార్చి 2021
Business - Jan 19, 2021 , 00:13:04

మైండ్‌ట్రీ లాభం 326 కోట్లు

మైండ్‌ట్రీ లాభం 326 కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 18: ప్రముఖ ఐటీ సేవలు సంస్థ మైండ్‌ట్రీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 2020తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.326.50 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.197 కోట్లతో పోలిస్తే ఇది 65.7 శాతం అధికం. బెంగళూరు కేంద్రస్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 3 శాతం పెరిగి రూ.2,023.70 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఇది రూ.1,965.30 కోట్లుగా ఉన్నది. డాలర్‌ రూపంలో కంపెనీ నికర లాభం 59.3 శాతం పెరిగి 44.2 మిలియన్‌ డాలర్లకు చేరుకోగా, ఆదాయం మాత్రం 274.10 మిలియన్‌ డాలర్లకు పడిపోయింది. డిసెంబర్‌ చివరినాటికి కంపెనీ యాక్టివ్‌ క్లయింట్ల సంఖ్య 276గా ఉండగా, గత త్రైమాసికంలో కొత్తగా ఎనిమిది జతయ్యా రు. ప్రస్తుతం సంస్థలో 22,195 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వలసలు 12.5 శాతంగా ఉన్నాయి. అన్ని విభాగాలు, ముఖ్యంగా సేవలు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడం వల్లనే మంచి పనితీరు కనబరుచగలిగామని కంపెనీ ఎండీ దేబాషిస్‌ చటర్జీ తెలిపారు. 

VIDEOS

logo