గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 25, 2020 , 18:21:43

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

 లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్‌మార్కెట్ లో ఉగాది కళ క‌నిపించింది. క‌రోనా ఎఫెక్ట్‌తో న‌ష్టాల బాట ప‌ట్టిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల‌తో ముగిశాయి. ఆరంభ నష్టాలనుంచి వెనువెంటనే తేరుకున్న సూచీలు త‌ర్వాత పుంజుకున్నాయి. సెన్సెక్స్ 1861.75 పాయింట్లు లాభ‌ప‌డి 28, 535.78 వ‌ద్ద ముగియ‌గా...నిఫ్టి 516.08 పాయింట్ల లాభంతో 8, 317 వ‌ద్ద ముగిసింది. రిల‌య‌న్స్‌, కోట‌క్‌, మహీంద్రా, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభ‌ప‌డ‌గా, య‌స్‌బ్యాంక్‌, కోల్ఇండియా, ఐవోసీ, ఐటీసీ షేర్లు న‌ష్ట‌పోయాయి. అటు డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.75.88 ద‌గ్గ‌ర కొన‌సాగుతుంది. కోవిడ్ -19   విస్తరణ నేపథ్యంలో ద్రవ్య సమస్యలు అధిగమించేందుకు ప్రధానంగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు బ్యాంకు క్రెడిట్ లైన్ ను ప్రకటించడంతో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరునెలకొంది.  అటు  కరోనాపై పోరాటానికి అమెరికా 2- ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్ర‌క‌టించ‌డంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలు  భారీగా పుంజుకున్నాయి. 


logo