శనివారం 30 మే 2020
Business - Apr 27, 2020 , 11:16:12

స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్‌మార్కెట్లు

స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్‌మార్కెట్లు

ముంబై: దేశీయ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.  అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేప‌థ్యంలో సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. ముఖ్యంగా  కరోనా వైరస్ క‌ట్ట‌డికి అదనపు చర్యలు తీసుకుంటార‌న్నా అంచనాలతో మార్కెట్లు లాభాల‌తో సెషన్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 662 పాయింట్లు ఎగిసి 31,989 వద్ద కొన‌సాగుతుండ‌గా, నిప్టీ 169 పాయింట్లు లాభపడి 9,349 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. తద్వారా నిఫ్టీ194 పాయింట్లు లాభ‌ప‌డింది.  దాదాపు అన్నిరంగాల షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి. సిప్లా, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంకు, భారతి ఇన్ ఫ్రాటెల్, రిలయన్స్, మారుతి సుజుకి, సన్ ఫార్మ లాభ పడుతున్నాయి.  ఎన్టీపీసీ, విప్రో నష్టపోతున్నాయి. కాగా డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.75.59 ద‌గ్గ‌ర కొన‌సాగుతుంది.


logo