బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 22, 2020 , 10:10:10

లింక్డ్‌ఇన్‌లో 960 ఉద్యోగాల కోత

 లింక్డ్‌ఇన్‌లో  960 ఉద్యోగాల కోత

వాషింగ్టన్‌:  ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి  దెబ్బతో ఆరు శాతం ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని ప్రముఖ ప్రొఫెషనల్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డ్‌ఇన్‌  నిర్ణయించింది.  ప్రపంచవ్యాప్తంగా   960 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ను ప్రకటించింది.   కోవిడ్‌-19 ప్రభావంతో  ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తుండటంతో వేల సంఖ్యలో వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నారు.    కంపెనీలో మరింత సిబ్బందిని  తొలగించే ఉద్దేశం లేదని మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని లింక్డ్‌ఇన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ర్యాన్‌   రాస్‌ల్యాన్‌స్కై పేర్కొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ల మంది  కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాయం చేస్తామని కంపెనీ నిర్ణయించింది. 


logo