న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రముఖ ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ ప్రొక్టర్అండ్ గ్యాంబ్లీ హైజిన్ అండ్ హెల్త్‌కేర్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.49.98 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన రూ.69.21 కోట్ల లాభంతో పోలిస్తే 29.2 శాతం తగ్గినట్లు పేర్కొంది. అయినప్పటికీ కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 23.96 శాతం ఎగబాకి రూ.786.59 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఇది రూ.634.53 కోట్లుగా ఉన్నది.