శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 27, 2021 , 20:01:53

ప్రైవేటీకరణకు కేంద్ర క్యాబినెట్‌ పచ్చజెండా?!

ప్రైవేటీకరణకు కేంద్ర క్యాబినెట్‌ పచ్చజెండా?!

న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌కు సమర్పించనున్న బడ్జెట్‌లో ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటీకరణ దిశగా గత కొన్నాళ్లుగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రైవేటీకరణ విధానాలను బడ్జెట్‌లో పొందుపరిచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విధానాల ప్రకారం ప్రముఖ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు ముమ్మరమవుతాయి. 

పలు పబ్లిక్‌ సెక్టర్‌ కంపెనీలను ప్రైవేటీకరించేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించి వాటిని క్యాబినెట్ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తున్నది. ఒకవైళ ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గు చూపిన పక్షంలో విశాఖలోని ప్రముఖ రాష్ట్ర ఇస్పా నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్ఎల్-విశాఖ ఉక్కు) ప్రైవేటుకు ధారదత్తం చేసే అవకాశాలున్నాయి. 2017-18లో ప్రకటించిన పెట్టుబడుల ఉపసంహరణ మొత్తం రూ.1లక్ష కోట్ల కన్నా ఎక్కువగా.. రూ.2.1 లక్షల కోట్లు, రూ.1.1 లక్షల కోట్లు ప్రకటించినట్లు 2020 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం ఇక్కడ గమనించాలి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) యొక్క ప్రణాళికాబద్ధమైన ఐపీఓ ను సీతారామన్‌ ఇప్పటికే ప్రకటించారు. భారత్ పెట్రోలియం, కంటైనర్ కార్ప్, షిప్పింగ్ కార్ప్‌ ప్రైవేటీకరణను కూడా నవంబర్ 2019 లోనే క్యాబినెట్ క్లియర్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటితోపాటు ఎయిర్‌ ఇండియా కూడా పూర్తవుతాయని భావిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo