గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 13, 2020 , 00:13:42

మీ సొమ్ము భద్రం

మీ సొమ్ము భద్రం
  • డిపాజిట్లను వెనక్కి తీసుకోకండి
  • ప్రైవేట్‌ బ్యాంకులపై రాష్ర్టాలతో ఆర్బీఐ

న్యూఢిల్లీ, మార్చి 12: ప్రైవేట్‌ రంగ బ్యాంకు ల్లో సొమ్ము భద్రంగానే ఉంటుందని, భయాలు అక్కర్లేదని ఆర్బీఐ ఓ ప్రకటన చేసింది. డిపాజిట్లను ఉపసంహరించుకోవద్దని రాష్ర్టాలకు సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాల చీఫ్‌ సెక్రటరీలకు ఆర్బీఐ లేఖలు రాసింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ల ఉపసంహరణ.. మొత్తం బ్యాం కింగ్‌, ఆర్థిక రంగాల సుస్థిరతనే దెబ్బ తీస్తుందని చెప్పింది. యెస్‌ బ్యాంక్‌ సంక్షో భం నేపథ్యంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఉన్న నిధులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేసుకోవాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత ప్రభుత్వ శాఖలు, సంస్థలకు సూచిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ పైవిధంగా స్పందించింది. మరోవైపు జూన్‌ నాటికి ఆర్బీఐ కనీసం 65 బేసిస్‌ పాయిం ట్ల మేర కీలక వడ్డీరేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల ద్రవ్యసమీక్షలో కొంత, ఆపై సమీక్షలో మరికొంత రెపో రేటుకు కోత పెట్టవచ్చని చెబుతున్నారు. ఇదిలావుంటే సోమవారం 2 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా డాలర్లను ఆర్బీఐ విక్రయించనున్నది. దేశీ య ఫారెక్స్‌ మార్కెట్‌ స్థిరీకరణలో భాగంగానే బ్యాంకులకు డాలర్లను ఆర్బీఐ అమ్మాలని నిర్ణయించింది. ఇకపోతే ఆర్బీఐ సెంట్రల్‌ బోర్డులోకి ఆర్థిక సేవల శాఖ సెక్రటరీ దేబాశిష్‌ను నామినేట్‌ చేశారు.


logo