మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 13, 2020 , 03:05:08

ఎన్‌పీఎస్‌తో చింతలేని రాబడి

ఎన్‌పీఎస్‌తో చింతలేని రాబడి

  • రోజుకు రూ.200 చెల్లిస్తే చేతికి రూ.45 లక్షలు
  • ఆపై ప్రతినెలా రూ.22,500 పెన్షన్‌ లభ్యం

డబ్బు సంపాదించాలని భావించే వారికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ రిస్క్‌ లేకుండా రాబడి పొందాలంటే మాత్రం మీ సొమ్మును చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. ఇందుకు కేవలం కొన్ని స్కీమ్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) ఒకటి. ఎన్‌పీఎస్‌ స్కీమ్‌లో రెండు రకాల అకౌంట్లు ఓపెన్‌ చేయవచ్చు. వీటిలో ఒకదాన్ని కచ్చితంగా తెరవాలి. రెండోది ఆప్షనల్‌. వీటిని టైర్‌-1, టైర్‌-2 అకౌంట్లు అని పిలుస్తారు. టైర్‌-1 అకౌంట్‌ ఉన్నవారు టైర్‌-2 అకౌంట్‌ను తెరవవచ్చు. 18 నుంచి 65 ఏండ్లలోపు వయసున్నవారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఎన్‌పీఎస్‌లో మీరు ఇన్వెస్ట్‌చేసే డబ్బును పీఎఫ్‌ఆర్డీయే (పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) లాంటి రిజిస్టర్డ్‌ ఫండ్‌ మేనేజర్లు.. ఈక్విటీలు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఫిక్స్‌డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. జూలై 31లోగా ఎన్‌పీఎస్‌లో చేరేవారు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 

ఎంత లాభదాయకమంటే..

30 ఏండ్ల వయసులో ఉన్నవారు రోజుకు రూ.200 లేదా నెలకు రూ.6,000 చొప్పున ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌చేస్తూ వెళ్లాలి. ఇలా 30 సంవత్సరాలపాటు ఇన్వెస్ట్‌మెంట్‌ కొనసాగించాలి. దీంతో మీరు మొత్తం రూ.21.90 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తారు. దీనిపై 8 శాతం రాబడి ప్రకారం చూస్తే మెచ్యూరిటీలో రూ.90 లక్షలు వస్తాయి. ఇందులో సగం మొత్తంతో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. మిగిలిన రూ.45 లక్షలను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక యాన్యుటీ ప్లాన్‌పై 6 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్‌ ద్వారా 60 ఏండ్ల వయసు దాటినవారు నెలకు రూ.22,500 చొప్పున పెన్షన్‌ తీసుకోవచ్చు.


logo