ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 01, 2021 , 19:56:11

క‌స్ట‌మ్స్ డ్యూటీ పెంపు: ల‌గ్జ‌రీ కార్లు కొంటే రంగు ప‌డుద్ది?!

క‌స్ట‌మ్స్ డ్యూటీ పెంపు: ల‌గ్జ‌రీ కార్లు కొంటే రంగు ప‌డుద్ది?!

ముంబై: వ‌చ్చే ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ప్రీమియం, ల‌గ్జ‌రీ కార్ల ధ‌ర‌లు రూ.35 వేల నుంచి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెరుగనున్నాయి. మేడ్ ఇన్ ఇండియా థీమ్‌ను బ‌లోపేతం చేసే ల‌క్ష్యంతో కేంద్రం విదేశాల నుంచి వివిధ వ‌స్తువుల విడి భాగాల దిగుమ‌తుల‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సుంకాలు మోపారు ఈ కార్ల‌లో వినియోగించే విడి భాగాల‌పై 5 నుంచి 7.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతున్న‌ట్లు  ప్ర‌క‌టించారు.

ఇంజిన్‌కు సేఫ్టీ గ్లాస్‌, గేర్ కాంపొనెంట్స్‌, బ్రేక్‌లు, పెడ‌ల్స్‌ల‌కు ఎల‌క్ట్రిక్ అండ్ వైరింగ్ భాగాలు త‌దిత‌ర విడి భాగాల‌పై ఈ సుంకం భారం ప‌డ‌నున్న‌ది. ప్ర‌త్యేకించి పూర్తిగా విదేశాల నుంచి విడి భాగాల‌పై ఆధార‌ప‌డే ప్రీమియం, ల‌గ్జ‌రీ కార్ల త‌యారీదారుల‌పై ఈ సుంకం భారం ప‌డ‌నున్న‌ది. కొన్ని విడి భాగాల‌పై 15 శాతం వ‌ర‌కు దిగుమ‌తి సుంకం విధిస్తామ‌ని సీతారామ‌న్ తేల్చేశారు.

దేశంలోకెల్లా అతిపెద్ద ల‌గ్జ‌రీ అండ్ ప్రీమియం కార్ల త‌యారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కం సీఈవో మార్టిన్ స్కూవెంక్ మాట్లాడుతూ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో దిగుమ‌తి సుంకాల పెంపును అస‌లు ఊహించ‌లేద‌న్నారు. విడి భాగాలపై సుంకం భారం ఉత్ప‌త్తిపై ప‌డుతుందని అంతిమంగా క‌స్ట‌మ‌ర్ల‌పై అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని మార్టిన్ స్ప‌ష్టం చేశారు. గ‌త నెల ప్రారంభంలోనే ఇన్‌పుట్ కాస్ట్ పెరిగింద‌ని కార్ల త‌యారీ సంస్థ‌ల‌న్నీ 2-4 శాతం ధ‌ర‌లు పెంచేశాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo