శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Feb 04, 2020 , 00:02:46

శాంతించిన పసిడి

శాంతించిన పసిడి
  • రూ.281 తగ్గిన తులం ధర,రూ.712 దిగిన వెండి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ పడిపోవడంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం ధర రూ.281 తగ్గి రూ.41,748కి తగ్గినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. శనివారం బంగారం ధర రూ.42,029 వద్ద ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ధర ఏకంగా రూ.712 తగ్గి రూ.47,506 వద్ద నిలిచింది. గ్లోబల్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,578 డాలర్లకు పడిపోగా, వెండి 17.78 డాలర్ల వద్ద ఉన్నది. 
logo