శుక్రవారం 23 అక్టోబర్ 2020
Business - Sep 22, 2020 , 02:49:03

త్వరలో ప్రి-ఫిల్డ్‌ రిటర్న్‌ ఫామ్‌

త్వరలో ప్రి-ఫిల్డ్‌ రిటర్న్‌ ఫామ్‌

న్యూఢిల్లీ: జీఎస్టీ పరిధిలోని వ్యాపారులకు త్వరలో ప్రి-ఫిల్డ్‌ రిటర్న్‌ ఫామ్‌ (జీఎస్టీఆర్‌-3బీ) అందుబాటులోకి రానున్నది. జీఎస్టీ నెట్‌వర్క్‌ (జీఎస్టీఎన్‌) సీఈవో ప్రకాశ్‌ కుమార్‌ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులకు ప్రి-ఫిల్డ్‌ జీఎస్టీఆర్‌-3బీ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, దీంతో పన్నులు చెల్లించడం సులభమవుతుందని చెప్పారు. ఎడిట్‌ ఆప్షన్‌ను కలిగి ఉండే ఈ ఫామ్‌తో వ్యాపారులు పాత పన్ను బకాయిలను సర్దుబాటు చేసుకునేందుకూ వీలవుతుందని పీటీఐ వార్తా సంస్థకు వివరించారు. పీడీఎఫ్‌ రూపంలో ఉండే జీఎస్టీఆర్‌-3బీ ఫామ్‌లో పన్ను చెల్లింపుదారులు పొందుపర్చాల్సిన ట్యాక్స్‌ లయబిటీ డాటాను అందజేసే ప్రక్రియను జీఎస్టీఎన్‌ ఇప్పటికే ప్రారంభించింది.


logo