Business
- Jan 26, 2021 , 01:45:30
VIDEOS
విలీనం వాయిదా

న్యూఢిల్లీ, జనవరి 25: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం వాయిదా వేసింది. ఎంటీఎన్ఎల్ అధిక రుణ భారమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఉద్యోగుల వేతన వివాదాలూ ఉన్నట్లు సమాచారం. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్లను ఆదుకోవడంలో భాగంగా రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీలో ఇరు సంస్థల విలీన ప్రతిపాదన, ఆస్తుల నగదీకరణ నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఇదిలావుంటే నొయిడాలోని 6వేల చదరపు మీటర్ల బీఎస్ఎన్ఎల్ స్థలాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు అమ్మేందుకు మంత్రుల బృందం అంగీకరించింది.
తాజావార్తలు
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- చివరి టెస్టుకు నెట్స్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
- టాప్-10 బిలియనీర్లలో జాక్‌మా మిస్?!
- వీడియో : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన ఎమ్మెల్యే
MOST READ
TRENDING