సోమవారం 30 మార్చి 2020
Business - Feb 04, 2020 , 23:53:01

మార్కెట్లోకి పొకో ఎక్స్‌2

మార్కెట్లోకి పొకో ఎక్స్‌2
  • ప్రారంభ ధర రూ.15,999

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశీయ మొబైల్‌ మార్కెట్లోకి పోకో ఎక్స్‌2 మొబైల్‌ను విడుదల చేస్తున్నట్లు పోకో ఇండియా ప్రకటించింది. మూడు రకాల్లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధరను రూ.15,999గా నిర్ణయించింది. 6.67 అంగుళాల టచ్‌స్క్రీన్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64+8+2+2 మెగాపిక్సెల్‌ కెమెరా, ముందుభాగంలో 20+2 మెగాపిక్సెల్‌ కెమెరాలు, ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6జీబీ ర్యామ్‌, 256 జీబీ వరకు మెమెరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లు రూ.15,999 నుంచి రూ.19,999 లోపు లభించనున్నాయి. వీటిలో 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ మెమొరీలో ఉన్నాయి.  ఈ నెల 11 నుంచి ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఈ మొబైళ్లు లభించనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 


logo