శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 21, 2020 , 02:19:31

కరోనాపై పీఎన్‌బీ పోరు

కరోనాపై పీఎన్‌బీ పోరు

న్యూఢిల్లీ, జూలై 20: కొవిడ్‌-19 వ్యాప్తిని ప్రతిఘటించేందుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద సోమవారం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా దేశంలోని 662 జిల్లాల్లో మాస్కులు, శానిటైజర్ల లాంటి సామగ్రిని పంపిణీ చేయనున్నట్టు ఆ బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. పీఎన్‌బీ చేపట్టిన కార్యక్రమం ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. 

తాజావార్తలు


logo