గురువారం 03 డిసెంబర్ 2020
Business - Oct 26, 2020 , 18:19:02

నీరవ్ మోదీ బెయిల్‌ను తిరస్కరించిన లండన్‌ కోర్టు

నీరవ్ మోదీ బెయిల్‌ను తిరస్కరించిన లండన్‌ కోర్టు

న్యూఢిల్లీ : పారిపోయిన డైమండ్‌ వ్యాపారి నీరవ్ మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్‌ మోదీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను లండన్‌ కోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ నెల ప్రారంభంలో యూకే కోర్టు నవంబర్ 3 న కొనసాగుతున్న అప్పగించే విచారణలో తదుపరి షెడ్యూల్ విచారణ వరకు మోదీ రిమాండ్‌ను పొడిగించింది. గత నెలలో మోదీ యొక్క న్యాయవాది లండన్‌ కోర్టుకు హాజరై.. నీరవ్ మోదీకి భారతదేశంలో న్యాయమైన విచారణ జరిగే అవకాశం లేదని చెప్పారు. తన కేసును రాజకీయం చేయడం, భారతీయ జైళ్లలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల అతను ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం అధికంగా ఉన్నదని స్పష్టం చేశారు. 

2 బిలియన్ డాలర్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో మోసం, మనీలాండరింగ్ అభియోగాలపై అప్పగించాలని భారత్‌ పోరాడుతుండగా.. పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను యూకే కోర్టు ఐదవసారి తిరస్కరించింది. 49 ఏండ్ల వయసున్న నీరవ్‌ మోదీ.. వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ వద్ద వీడియోలింక్ ద్వారా నిర్వహించిన కాల్-ఓవర్ విచారణ సందర్భంగా రిమాండ్‌కు తరలించారు. భారత ప్రభుత్వం తెచ్చిన ఆరోపణలపై స్కాట్లాండ్ యార్డ్ జారీచేసిన వారెంటుపై 2019 మార్చి 19 న నీరవ్ మోదీని అరెస్టు చేశారు. అప్పటి నుంచి నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంటున్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.