శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 03, 2021 , 18:22:51

5న కోచి-మంగళూరు ఎల్‌ఎన్జీ పైపులైన్‌ జాతికి అంకితం

5న కోచి-మంగళూరు ఎల్‌ఎన్జీ పైపులైన్‌ జాతికి అంకితం

న్యూఢిల్లీ: కోచి-మంగళూరు నేచురల్‌ గ్యాస్‌ పైపులైన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా జాతికి అంకితం చేయనున్నారు. ఇది ‘ఒకే దేశం- ఒకే గ్యాస్‌ గ్రిడ్‌’ దిశగా భారత్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక మైలురాయి కానున్నదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోపాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు పాల్గొంటారని వెల్లడించింది. 

450 కిలోమీటర్ల దూరం గల ఈ పైపులైన్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ (ఇండియా) నిర్మించింది. ప్రతిరోజూ 12 మిలియన్ల మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను రవాణా చేయడం దీని సామర్థ్యం. కేరళలోని కోచి లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్జీ) రీ గ్యాసిఫికేషన్‌ టర్మినల్‌ నుంచి కర్ణాటలోకి దక్షిణ కన్నడ జిల్లా మంగళూరుకు ఈ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ రవాణా అవుతుంది. కేరళలోని ఎర్నాకులం, త్రిసూర్‌, పాలక్కడ్‌, మల్లపురం, కోజికోడ్‌, కన్నూర్‌, కాసరగోడ్‌ జిల్లాల మీదుగా ఈ పైపులైన్‌ సాగుతుంది. 

హరిజోంటల్‌ డైరెక్షనల్‌ డ్రిల్లింగ్‌ మెథడ్‌ ద్వారా 100కి పైగా కేంద్రాల్లో నీటి సంస్థల మీదుగా ఈ గ్యాస్‌లైన్‌ మార్గంలో పైపులైన్‌ నిర్మించడం ఇంజినీరింగ్‌ విభాగానికే సవాల్‌గా మారింది. దీనికోసం రూ.3,000 కోట్లు గెయిల్‌ ఖర్చు చేసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo