e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News రూ.2000 నోటుకు ఆర్బీఐ రాంరాం!!

రూ.2000 నోటుకు ఆర్బీఐ రాంరాం!!

రూ.2000 నోటుకు ఆర్బీఐ రాంరాం!!

ముంబై: భార‌తీయ రిజ‌ర్వుబ్యాంక్ (ఆర్బీఐ) రూ.2000 నోట్ల‌కు రాంరాం చెప్పే ప‌నిలో ప‌డింది. గ‌త రెండేండ్లుగా రూ. 2,000 విలువైన నోట్ల‌ను ముద్రించ‌డం నిలిపివేసింది. క్ర‌మ క్ర‌మంగా ఈ నోట్ల‌ను స‌ర్క్యులేష‌న్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని యోచిస్తున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ది.

2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.57,757 నోట్ల విలువ గ‌ల రూ.2000 నోట్లు మార్కెట్‌లో చ‌లామ‌ణి నుంచి మాయం అయ్యాయ‌ని ఆర్బీఐ తాజా వార్షిక నివేదిక‌లో వెల్ల‌డించింది. ఒక‌వేళ 2019-20లో రూ.2000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు ఉంటే, 2020-21 నాటికి రూ.4,90,195 కోట్ల‌కు ప‌డిపోయింద‌ని తెలిపింది.

2018 మార్చి నాటికి 336.3కోట్ల రూ. 2వేల నోట్లు చలామణీలో ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ సంఖ్య 245.1 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 91.2కోట్ల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది.

అంటే, గ‌తేడాది కాలంలో రూ.57,757 కోట్ల విలువైన అధిక విలువ గ‌ల రూ.2000 నోట్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకున్న‌ది. న‌కిలీ నోట్లు, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఉప‌సంహ‌రిస్తున్నారా? ఇత‌ర కార‌ణాలేమైనా ఉన్నాయా? అన్న విష‌యం తెలియ‌రాలేదు.

2018-19 నుంచే ఆర్బీఐ రూ.2000 నోట్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించ‌డం ప్రారంభించింది. అంటే రూ.14,400 విలువైన రూ.2000 నోట్ల‌ను విత్ డ్రా చేసింది.

రూ.2000 నోటుకు ఆర్బీఐ రాంరాం!!

ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం మార్కెట్‌లో చ‌లామణిలో ఉన్న నోట్ల‌లో రూ.2000 నోట్లు 17.3 శాతం. ఇది 2019-20లో 22.6 శాతం. మార్కెట్‌లో మొత్తం రూ.28.26 ల‌క్ష‌ల కోట్ల న‌గ‌దు చ‌లామ‌ణిలో ఉంది. 2019-20లో రూ.5.47 ల‌క్ష‌ల కోట్ల విలువ గ‌ల రూ.2000 నోట్లు రూ.4.9 ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌డిపోయాయి.

దాదాపు నాలుగేండ్ల క్రితం ర‌ద్దైన‌ పాత పెద్ద నోట్ల స్థానంలో రూ.2000 నోట్ల‌ను కేంద్రం చ‌లామ‌ణిలోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డానికి రూ.2000 విలువైన నోట్ల చ‌లామ‌ణిని త‌గ్గించాల‌ని కేంద్రం, ఆర్బీఐ భావించాయి.

కానీ అనూహ్యంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి న‌గ‌దు చ‌లామ‌ణి పెరిగిపోయింద‌ని ఆర్బీఐ పేర్కొంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో చలామణీలో ఉన్న నగదు విలువ పరంగా 16.8శాతం, సంఖ్య పరంగా 7.2 శాతం పెరిగిందన్న‌ది.

గ‌త మార్చి నెలాఖ‌రు నాటికి చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల మొత్తం కరెన్సీ విలువలో రూ. 500, రూ. 2వేల నోట్ల వాటా 85.7శాతం. కొవిడ్ మహమ్మారి, ఆంక్షల నేపథ్యంలో నగదు వినియోగం పెరిగిందని తెలిపింది.

దీంతో బ్యాంకు నోట్లకు డిమాండ్‌ ఎక్కువైనట్లు తెలిపింది. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త నోట్ల సరఫరా కూడా చేపట్టామని, కరెన్సీ చెస్ట్‌ల్లో సరిపడా నిల్వలు ఉండేలా చూసుకున్నామని ఆర్బీఐ వివ‌రించింది.

కొత్త నోట్ల ముద్ర‌ణ కోసం గ‌తేడాది రూ.4,012 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం రూ.500, రూ.200, అంత‌కంటే త‌క్కువ విలువ నోట్ల ముద్ర‌ణ పెంచామ‌ని తెలిపింది.

ఇవి కూడా చ‌ద‌వండి:

నోట్లు ముద్రించడమే మార్గం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

ప్ర‌పంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం ప‌దిలం

వ్యాక్సినేష‌న్ తోనే ఎకాన‌మీపై మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ కు చెక్ : ఆర్బీఐ

వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!

30 రోజుల్లో వాపస్‌

హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో రేపు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

ఐటీ కొత్త రూల్స్‌.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ట్విట్ట‌ర్ సంస్థ‌

మామిడి పండ్లు తిన‌గానే ఆ ఐదింటి జోలికి అస‌లే పోవ‌ద్దు..!

నన్నెవ‌రూ అరెస్ట్ చేయ‌లేరు : రాందేవ్ బాబా

యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ట్రయల్స్‌కు జైడస్‌ దరఖాస్తు

భార‌తీయ ఐటీ చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం : గూగుల్ సీఈవో

12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్‌ సురక్షితం : ఫైజర్‌

దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు

మెహుల్‌ చోక్సీ దొరికాడు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రూ.2000 నోటుకు ఆర్బీఐ రాంరాం!!

ట్రెండింగ్‌

Advertisement