ముంబై, సెప్టెంబర్ 2: సూపర్బైకుల తయారీ సంస్థ పియాజియో..దేశీయ మార్కెట్లోకి ఒకేసారి మూడు మోడళ్ళను విడుదల చేసింది. వీటిలో అప్రిలియా ఆర్ఎస్ 660, ట్యూనో 660, అప్రిలియా ఆర్ఎస్వీ4, ట్యూనో వీ4లతోపాటు ఐకానిక్ మోటో గుజ్జి వీ85టీటీ ఉన్నాయి. ఈ సూపర్ బైకులు రూ.13.09 లక్షల ప్రారంభ ధరతో గరిష్ఠంగా రూ.23.69 లక్షల లోపు లభించనున్నాయని కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి. వీటిలో 660 సీసీ అప్రిలియా ఆర్ 660 ధర రూ.13.39 లక్షలు కాగా, ట్యూనో 660 ధర రూ.13.09 లక్షలు, 1078 సీసీ ఆర్వీ4 మోడల్ ధర రూ.23.69 లక్షలుగా నిర్ణయించింది. వీటితోపాటు 1077 సీసీ ట్యూనో వీ4 ధర రూ.20.66 లక్షలు, 850 సీసీ మోటోగుజ్జి వీ85టీటీ విలువ రూ.15.40 లక్షలని కంపెనీ పేర్కొంది.