సోమవారం 30 మార్చి 2020
Business - Jan 19, 2020 , 00:26:38

‘మార్పు కోసం మహా కృషి’

 ‘మార్పు కోసం మహా కృషి’
  • -ఫీనిక్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ చుక్కపల్లి సురేష్‌కు చాంపియన్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తోడ్పడిన సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలన్న ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే చాలు.. అందుకు తగ్గ మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. జీవితంలో ఇలాంటి ఒక సాధారణ మార్గదర్శక సూత్రాన్ని అనుసరించి, త్రికరణశుద్ధితో అడుగులు ముందుకేయడం వల్ల ఆయన నేడు విజేతగా నిలిచారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా భారతదేశాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక పోషించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘చాంపియన్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డు’ను ప్రకటించింది. సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఈ జాతీయ స్థాయి అవార్డును అందుకుంటున్న వ్యక్తి మరెవరో కాదు..ఫీనిక్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ చుక్కపల్లి సురేష్‌.


చుక్కపల్లి ప్రస్థానం..

‘చుక్కపల్లి సురేష్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూ రు జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు. పయోనీర్‌ ఆటోమొబైల్స్‌ వెంచర్‌కు శ్రీకారం చుట్టిన ఆయన..రియల్‌ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏర్పాటు చేసిన ఫీనిక్స్‌ గ్రూపు చైర్మన్‌గా ఎదిగారు. నిర్మాణ రంగంలో సరికొత్త పోకడల్ని సృష్టించారు. దాదాపు ముప్పయ్యేండ్లలో ఆయన చేపట్టిన నివాస, వాణిజ్య, రిటైల్‌, ఐటీ సెజ్‌ల నిర్మాణాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

సమాజానికి తిరిగి ఇవ్వాలని..

సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు ఆయన. వీటి ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పెద్దగా దృష్టి సారించని పలు ప్రాజెక్టులకు పెద్దపీటవేశారు. ఫిలింనగర్‌లో ఆధునిక రీతిలో ‘వైకుంట మహాప్రస్థానం’ శ్మశానవాటికను అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, సిద్దిపేట్‌, గజ్వేల్‌, కరీంనగర్‌, సూర్యాపేట్‌, ఖమ్మం, గుంటూరు, వైజాగ్‌ వంటి నగరాల్లోని వైకుంఠదామాల్ని ప్రపంచస్థాయిగా ఆధునీకరించారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చేశారు.
- క్యాన్సర్‌ బాధితుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో ప్రత్యేకంగా ధర్మశాలను నిర్మించారు. ఇందులో డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంటూ రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా.. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిలో సుమారు వెయ్యి చెట్లను తీసి వేరొక చోట ఏర్పాటు చేశారు. తెలంగాణ హరితహారంలో ముందునుంచీ క్రియాశీలకమైన భూమికను పోషిస్తున్నది.
-భాగ్యనగరంలో మహిళా సాధికారతను పెంపొందించేందుకు ఆయన చూపెట్టిన మరో పరిష్కారమే.. ‘మోవో’. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌, ఎంఎన్‌సీ తదితర అనేక రంగాల్లో పని చేసే మహిళలు రాత్రివేళల్లో సురక్షితంగా ప్రయాణం చేసేందుకు మోవోను ప్రారంభించారు. మహిళలే సాటి మహిళల కోసం డ్రైవర్లుగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్నారు. 


logo