శనివారం 06 జూన్ 2020
Business - May 21, 2020 , 23:47:11

పీహెచ్‌డీ చాంబర్స్‌ విరాళం రూ.528 కోట్లు

పీహెచ్‌డీ చాంబర్స్‌ విరాళం రూ.528 కోట్లు

న్యూఢిల్లీ: ప్రధాని సహాయ నిధికి పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(పీహెచ్‌డీసీసీఐ) రూ.528 కోట్ల విరాళాన్ని అందించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ విరాళాన్ని అందించినట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ డీకే అగర్వాల్‌ తెలిపారు. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, దీంతో చాంబర్‌ సభ్యులు, స్టేట్‌ చాప్టర్స్‌, కార్యదర్శులు ప్రధాని నరేంద్ర  మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ భారీ విరాళాన్ని అందించడానికి ముందుకొచ్చినట్లు ఆయన చెప్పారు.  ఈ చెక్‌ను బీజేపీ జనరల్‌ సెక్రటరీ రామ్‌ మాధవ్‌కు అందించింది. 


logo