ఆదివారం 24 మే 2020
Business - Mar 10, 2020 , 01:36:11

రూ.71 దిగువకు పెట్రోల్‌

రూ.71 దిగువకు పెట్రోల్‌

న్యూఢిల్లీ, మార్చి 9: ఇంధన ధరలు శాంతించాయి. పెట్రోల్‌ ధరలు ఎనిమిది నెలల తర్వాత తొలిసారిగా రూ.71 దిగువకు పడిపోయాయి. చమురు సరఫరా దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రమవడంతో గ్లోబల్‌ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. 1991 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఇంతటి స్థాయిలో పతనవడంతో అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌ లాంటి దేశాలకు ఇది శుభవార్తలాంటిది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 24 పైసలు తగ్గి రూ.70.59కి, డీజిల్‌ ధర 25 పైసలు తగ్గి రూ.63.26 వద్దకు జారుకున్నది.  ఆయా నగరాల్లో విధిస్తున్న పన్నుల ఆధారంగా ధరలు మరింత తగ్గనున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ 25 పైసలు తగ్గి రూ.75.04కి చేరుకోగా, డీజిల్‌ మరో 27 పైసలు తగ్గి రూ.68.88 వద్ద నిలిచింది.   గత నెల 27 నుంచి తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు ఇప్పటి వరకు పెట్రోల్‌ రూ.1.42, డీజిల్‌ రూ.1.44 పడిపోయాయి.
logo