మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 31, 2020 , 01:15:12

పెరుగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెరుగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
  • బీఎస్‌-6 నిబంధనలతో ఏప్రిల్‌లో లీటర్‌పై రూపాయి వరకు భారం

న్యూఢిల్లీ, జనవరి 30: ఏప్రిల్‌లో పెట్రో ధరలు లీటర్‌కు 50 పైసల నుంచి రూపాయి వరకు పెరిగే అవకాశాలున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 వాహన కొనుగోళ్లనే కేంద్రం అనుమతించనున్నది. దీంతో ఈ శ్రేణి వాహనాలకు సరిపోయే ఇంధనం మార్కెట్‌లోకి రానుండగా, దాని ధర ఎక్కువగా ఉండనున్నది. అందుకే లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు 50 పైసల నుంచి రూపాయి పెరిగే వీలున్నది. ప్రస్తుతం బీఎస్‌-4 శ్రేణి ఇంధనం మార్కెట్‌లో అమ్ముతున్నారు. కాగా, వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకు బీఎస్‌-6 ఇంధనం వెళ్తుందని, ఏప్రిల్‌ 1 నుంచి 100 శాతం బీఎస్‌-6 నిబంధనలను పాటిస్తామని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. బీఎస్‌-6 ఇంధనం తయారీ కోసం రూ.17 వేల కోట్లతో ఐవోసీ తమ రిఫైనరీలను ఆధునికీకరిస్తున్నది.


logo
>>>>>>