గురువారం 04 జూన్ 2020
Business - Apr 13, 2020 , 00:19:34

చైనా చేతికి హెచ్‌డీఎఫ్‌సీ వాటా

చైనా చేతికి హెచ్‌డీఎఫ్‌సీ వాటా

  • 1.75 కోట్ల షేర్లను కొన్న చైనా సెంట్రల్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: దేశీయ బ్యాంకింగేతర ఆర్థిక దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లో దాదాపు 1.75 కోట్ల షేర్ల (1.01 శాతం)ను చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ హస్తగతం చేసుకున్నది. జనవరి-మార్చి త్రైమాసికంలో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఈ వాటాలను కొన్నట్లు ఎక్సేంజీ వివరాల ద్వారా తెలుస్తున్నది. అయితే దీనికి సంబంధించిన పూర్తి లావాదేవీల వివరాలు మాత్రం తెలియాల్సి ఉన్నది. నిరుడు అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీ తమ వాటాను 4.21 శాతం నుంచి 4.67 శాతానికి పెంచుకున్నది. కాగా, ఫిబ్రవరి మొదటి వారం నుంచి గమనిస్తే హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల విలువ 41 శాతం పతనమైంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ విలువ రూ.1,701.95గా ఉన్నది.


logo