శుక్రవారం 04 డిసెంబర్ 2020
Business - Aug 08, 2020 , 00:29:51

హైదరాబాద్‌లో పీడీఐ ఆఫీస్‌

హైదరాబాద్‌లో పీడీఐ ఆఫీస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అమెరికాకు చెందిన మరో టెక్నాలజీ సేవల సంస్థ పీడీఐ..భారత్‌లో తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు హైదరాబాద్‌కు విస్తరిస్తున్నాయని, ఇదే బాటలో యూఎస్‌కు చెందిన పీడీఐ తన కార్యకలాపాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ పేరు ప్రఖ్యాతులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభ పరిణామమన్నారు.  పీడీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రవి శంకర్‌ మోచర్ల మాట్లాడుతూ.. ఇది సవాళ్లతో కూడిన సమయం అని, తమ వినియోగదారులకు నాణ్యమైన సేవలందించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇప్పటికే చెన్నైలో కార్యాలయం ఉండగా, ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరించినట్లు చెప్పారు. ఈ సెంటర్‌లో ఇప్పటికే 40 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, త్వరలో ఈ సంఖ్యను 100కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే భారత్‌లో ఉన్న రెండు సెంటర్లలో 200 మంది ఉద్యోగులు ఉండగా, 300కి పెంచకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.