ఆదివారం 24 మే 2020
Business - Feb 05, 2020 , 11:24:24

ఆలిన్‌ వన్‌ పీవోఎస్‌ డివైస్‌లను లాంచ్‌ చేసిన పేటీఎం

ఆలిన్‌ వన్‌ పీవోఎస్‌ డివైస్‌లను లాంచ్‌ చేసిన పేటీఎం

ప్రముఖ డిజిటల్‌ వాలెట్‌ సంస్థ పేటీఎం దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం నూతనంగా ఆలిన్‌ వన్‌ పీవోఎస్‌ డివైస్‌లను లాంచ్‌ చేసింది. ఈ డివైస్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ఆధారంగా పనిచేస్తుంది. దీంతో పేటీఎం వాలెట్‌, యూపీఐ ఆధారిత యాప్స్‌ ద్వారా చెల్లింపులు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, క్యాష్‌ చెల్లింపులు చేయవచ్చు. అలాగే కస్టమర్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌, బిల్లింగ్‌, పేమెంట్స్‌, జీఎస్టీ లావాదేవీల నిర్వహణ, పేటీఎం బిజినెస్‌ యాప్‌, రెస్టారెంట్‌ మేనేజ్‌మెంట్‌, సినిమా టిక్కెట్లను జారీ చేయడం వంటి అనేక పనులను వ్యాపారులు కేవలం ఈ ఒక్క డివైస్‌ సహాయంతో నిర్వహించుకోవచ్చు. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ పలు రైళ్లలో ఈ పేటీఎం ఆలిన్‌ వన్‌ పీవోఎస్‌ డివైస్‌ల సహాయంతో ఫుడ్‌ ఆర్డర్లను విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పేటీఎం ఈ డివైస్‌లను ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్‌ మాట్లాడుతూ గత 18 నెలలుగా ఈ ఆలిన్‌ వన్‌ డివైస్‌లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, దాదాపు అన్ని రకాల పేమెంట్లను కేవలం ఈ ఒక్క డివైస్‌ సహాయంతో తీసుకోవచ్చని, అలాగే పలు ఇతర సదుపాయాలు కూడా ఉన్నందున ఈ డివైస్‌ చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 


logo