PayTm IPO | ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా స్టాక్మార్కెట్లోకి ఎంటరయ్యేందుకు సిద్ధమైన ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం.. ప్రీ-ఐపీవో రౌండ్‌కు వెళ్లడం లేదని శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. దీపావళి పర్వదినం తర్వాత ఐపీవోకు వెళ్లనున్నది పేటీఎం. ఇటువంటి పరిస్థితుల్లో ఐపీవోకు అదనపు స్టెప్స్ తీసుకోవాలని తాము భావించట్లేదని పేటీఎం వర్గాల కథనం. నేరుగా ఐపీవోకి వెళ్లడానికే పేటీఎం ప్రాధాన్యం ఇస్తున్నది.
ఐపీవో ద్వారా పేటీఎం 20-22 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు దీని విలువ 16 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లోకి వెళ్లడానికి నిర్ణయించుకున్న సంస్థలకు ప్రీ-ఐపీవో ఒక ఆప్షన్. కానీ మెజారిటీ కంపెనీలు దీన్ని వాడుకోవడం లేదు అని పేటీఎం వర్గాల కథనం. ప్రీ-ఐపీవో ఆప్షన్ ఎంచుకుంటే.. స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా చేరేందుకు ఐపీవో ప్రక్రియ జాప్యం అవుతుంది. అందుకు ప్రీ-ఐపీవో ఆప్షన్‌కు కంపెనీలు దూరంగా ఉంటాయని ఆ వర్గాలు తెలిపాయి.
దేశీయ డిజిటల్ పేమెంట్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో లీడింగ్ సంస్థ పేటీఎం. రెవెన్యూ సమకూర్చుకోవడానికి మల్టీస్టాక్ పేమెంట్ విధానాన్ని రూపొందించుకుంటున్నది. ఇప్పటికే పేటీఎం-ఐపీవోకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపినట్లు సమాచారం.
పేటీఎంకు గత మార్చి నెలాఖరు నాటికి 2.1 కోట్ల పై చిలుకు మర్చంట్లు, 33.3 కోట్ల మంది యూజర్లు ఖాతాదారులుగా ఉన్నారు. పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్, కామర్స్, క్లౌడ్ సర్వీసెస్‌ను అందిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Hyderabad | ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అగ్రస్థానం
Bullet Doctor : బుల్లెట్ బండి డాక్టర్.. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా?
మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన మహిళపై కన్నేసి ఆపై లైంగిక దాడి!
నంబర్ 16 నుంచి ‘ఇండియాజాయ్’.. తెలంగాణ ప్రభుత్వం మద్దతు