సోమవారం 03 ఆగస్టు 2020
Business - Jun 09, 2020 , 20:07:44

పోస్ట్‌పెయిడ్‌ సేవలను విస్తరించిన పేటీఎం

పోస్ట్‌పెయిడ్‌ సేవలను విస్తరించిన పేటీఎం

హైదరాబాద్‌: దేశంలోని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ అయిన పేటీఎం తన పోస్ట్‌పెయిడ్‌ సేవలను విస్తరించింది. ఈ మేరకు ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. రీచార్జెస్‌, బిల్‌ పేమెంట్లు, ఇంటర్నెట్‌ యాప్స్‌ ద్వారా చెల్లించే ఆన్‌లైన్‌ పేమెంట్స్‌తోపాటు కిరాణా స్టోర్స్‌కు పోస్ట్‌పెయిడ్‌ పరిమితిని పెంచింది. అలాగే, పేటీఎం లైట్‌, డిలైట్‌, ఎలైట్‌ పేరుతో పూచీకత్తులేని రుణాలు ఇవ్వనుంది. వివిధ బ్యాంకేతర సంస్థల భాగస్వామ్యంతో పేటీఎం ఈ సేవలు అందించనుంది. అలాగే, నెలవారీ గృహ అవసరాల కోసం (ఫర్నీచర్‌, ఎలక్ర్టానిక్‌ వస్తువులు కొనేందుకు) రూ. లక్ష దాకా రుణం ఇవ్వనుంది. వీటికి ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని ఆ సంస్థ తెలిపింది. కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు పేటీఎం తీసుకున్న నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. 


logo