శనివారం 06 జూన్ 2020
Business - Apr 12, 2020 , 00:52:10

100 కోట్లు సేకరించిన పేటీఎం

100 కోట్లు సేకరించిన పేటీఎం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: పీఎం-కేర్స్‌ ఫండ్‌ కోసం పేటీఎం రూ.100 కోట్లకుపైగా విరాళాలను సేకరించింది. కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమ వంతుగా పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.500 కోట్ల నిధులను అందించడమే మా లక్ష్యమని పేటీఎం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రూ.100 కోట్లకుపైగా విరాళాలను సేకరించామని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వాలెట్‌, యూపీఐ లేదా పేటీఎం బ్యాంక్‌ డెబిట్‌ కార్డు ద్వారా పేటీఎంపై చేసే ప్రతీ విరాళానికి తమ వంతు సాయంగా రూ.10 జత చేస్తున్నామని పేర్కొన్నది. 1,200లకుపైగా ఉద్యోగులు 15 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలల చొప్పున వేతనాలను విరాళంగా ఇస్తున్నట్లు చెప్పింది. మరోవైపు లుపిన్‌ కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో తమ వంతు సాయంగా రూ.21 కోట్లను విరాళంగా ప్రకటించింది. 


logo