గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 07, 2020 , 00:32:25

పేటీఎం చేతికి రహేజా క్యూబీఈ

పేటీఎం చేతికి రహేజా క్యూబీఈ

న్యూఢిల్లీ: ముం బైకి చెందిన ప్రైవేట్‌ రంగ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ రహే జా క్యూబీఈని పేటీఎం కైవసం చేసుకోనున్నది. వన్‌ 97 కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ ఆధీనంలోని పేటీఎం, ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ కలిసి రహేజా క్యూబీఈని కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం రహేజా క్యూబీఈలో ప్రిజమ్‌ జాన్సన్‌ (గతంలో దీని పేరు ప్రిజమ్‌ సిమెంట్‌ లిమిటెడ్‌)కు 51 శాతం, క్యూబీఈ ఆస్ట్రేలియాకు 49 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ మొత్తం వాటాలను తాము కొనుగోలు చేయన్నుట్టు పేటీఎం ప్రకటించింది. అయితే ఈ డీల్‌ విలువ ఎంతో వెల్లడించలేదు. 


logo