శనివారం 06 జూన్ 2020
Business - Apr 01, 2020 , 21:42:49

ఈఎంఐల చెల్లింపులో బ్యాంకుల ఆప్షన్లు ఇవిగో...

ఈఎంఐల చెల్లింపులో బ్యాంకుల ఆప్షన్లు ఇవిగో...

హైదరాబాద్ :  కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశంలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నెలవారీ రుణ వాయిదా (EMI) చెల్లింపుల మీద 3 నెలల మారటోరియం విధించింది. ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్‌గా కస్టమర్‌ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి డెబిట్ అయిపోతుంటాయి. EMIను దృష్టిలో పెట్టుకొని అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంటారు కస్టమర్లు.. అయితే అందరిలో ఆర్బీఐ మారటోరియం సూచించినట్టుగా రుణాల ఈఎంఐలు చెల్లించాలా? వద్దా? చెల్లిస్తే ఎంతవరకు చెల్లించాలి? మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుందా? మొత్తం అమౌంట్ చెల్లించాలా? తెలియక కస్టమర్లు గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో పలు బ్యాంకులు వివిధ రకాల ఆప్షన్లు అందిస్తున్నాయి...

కెనరా బ్యాంకు - డిఫాల్ట్ ఆప్షన్ : డిమాండ్ పై మాత్రమే రిలీఫ్ ఉంటుంది. 

EMI చెల్లింపును నిలిపివేయాలంటే  SMS ద్వారా ‘NO’ అని పంపాల్సి ఉంటుంది. 

IDFC ఫస్ట్ బ్యాంకు : డిమాండ్ పై మాత్రమే రిలీఫ్ ఉంటుంది. 

- ఈమెయిల్ ద్వారా మారటోరియాన్ని కస్టమర్లు అడగవచ్చు.

PNB (పంజాబ్ నేషనల్ బ్యాంకు) : ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు..

- ఒకవేళ చెల్లింపు కొనసాగించాలంటే బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

SBI : ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు..

- ఒకవేళ చెల్లింపు కొనసాగించాలంటే బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

HDFC : కస్టమర్ డిమాండ్‌పై మాత్రమే రిలీఫ్ పొందొచ్చు. 

- ఈమెయిల్ ద్వారా కస్టమర్లు బ్యాంకును అడగవచ్చు.

ICICI బ్యాంకు : కొన్ని లోన్లపై డిమాండ్ రిలీఫ్ మాత్రమే 

- ఈ విధానం ఎంపికల నిర్ణయంపై బ్యాంకులు పనిచేస్తున్నాయి.

IDBI బ్యాంకు : ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు.

- బ్యాంకు వెబ్ సైట్ లేదా ఈమెయిల్ ద్వారా కస్టమర్లు సంప్రదించవచ్చు.


logo