శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 02, 2020 , 15:36:15

పోర్స్చే ఇండియా డైరెక్టర్‌ పదవికి పవన్‌ శెట్టి రాజీనామా

పోర్స్చే ఇండియా డైరెక్టర్‌ పదవికి పవన్‌ శెట్టి రాజీనామా

న్యూఢిల్లీ : పోర్స్చే ఇండియా డైరెక్టర్ పదవికి పవన్ శెట్టి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రెండు రోజుల క్రితం ఆ పదవికి రాజీనామా చేసినట్లు పవన్‌ శెట్టి  వెల్లడించారు. ప్రస్తుతం పోర్స్చే ఇండియా సేల్స్ హెడ్ ఆశిష్ కౌల్‌కు శెట్టి బాధ్యతలు అప్పగించారు. శెట్టి స్థానంలో త్వరలో కంపెనీ శాశ్వత నియామకం చేపట్టనున్నది.

పవన్‌ శెట్టి 2016 జనవరి నెలలో పోర్స్చే ఇండియాలో చేరారు. అంతకుముందు అతను లంబొర్గిని ఇండియా అధిపతిగా సేవలందించారు. వోక్స్‌ వ్యాగన్, స్కోడా, ఆడి, పోర్స్చే, లంబోర్గిని బ్రాండ్లు అన్నీ భారతదేశంలోని వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌నకు చెందినవే. పోర్స్చే ఇండియా ఇటీవలే తన ప్రత్యేక పనామెరా 4 యొక్క 10 ఏండ్ల ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. దేశంలో లగ్జరీ స్పోర్ట్స్ సెలూన్ల 10 వ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు ఈ మోడల్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ మోడల్ ధర రూ.1.60 కోట్లు (ఇండియా ఎక్స్-షోరూమ్ ధర)గా కంపెనీ నిర్ణయించింది.


logo