ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 01, 2021 , 20:03:30

జ‌న‌వ‌రిలోనూ పైపైకి వెహిక‌ల్ సేల్స్.. మారుతి డౌన్‌

జ‌న‌వ‌రిలోనూ పైపైకి వెహిక‌ల్ సేల్స్.. మారుతి డౌన్‌

న్యూఢిల్లీ: వ‌రుస‌గా ఆరో నెల‌లోనూ ప్యాసింజ‌ర్ వాహ‌నాల సేల్స్ స్థిరంగా పెరిగాయి. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌భావం నేప‌థ్యంలో వ్య‌క్తిగ‌త మొబిలిటీ వ‌స‌తుల కోసం ప్రజ‌లు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020తో పోలిస్తే, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వాహ‌నాల విక్ర‌యాలు 15 శాతం పెరిగాయి. 2020 జ‌న‌వ‌రిలో 2,62,714 వాహ‌నాలు విక్ర‌యించ‌గా, ఈ ఏడాది 3.03 ల‌క్ష‌ల వాహ‌నాలు దేశ‌వ్యాప్తంగా అమ్ముడు పోయాయి.

దేశంలోకెల్లా అతిపెద్ద ప్ర‌యాణికుల సంస్థ మారుతి సుజుకి మాత్రం గ‌తేడాదితో పోలిస్తే స్వ‌ల్పంగా 0.6 శాతం త‌గ్గింది. 2020లో 1,39,844 కార్ల‌ను విక్ర‌యించ‌గా, ఈ ఏడాది 1,39,002 మాత్ర‌మే అమ్ముడ‌య్యాయి. మినీ కార్లు ఆల్టో, ఎస్‌-ప్రెస్సో మోడ‌ల్ కార్ల విక్ర‌యాలు 2.8 శాతం త‌గ్గి 25,153 యూనిట్ల‌కు ప‌డిపోయాయి. కంపాక్ట్ మోడ‌ల్ కార్లు వ్యాగ‌నార్‌, స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌, టూర్ ఎస్ కార్ల విక్ర‌యాలు 8.8 శాతం త‌గ్గి 76,935 యూనిట్ల‌కు త‌గ్గాయి.

మారుతి ప్ర‌త్య‌ర్థి హ్యుండాయ్ కార్ల విక్ర‌యాలు 24 శాతం వ్రుద్ధి చెంది 52,005 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ కార్ల విక్ర‌యాలు దాదాపు రెట్టింపై 26,978కి చేరాయి. హోండా కార్స్ ఇండియా హోల్‌సేల్ కార్ల విక్ర‌యాల్లో ఎకాఎకీనా 114 శాతం పురోగ‌తి న‌మోదు చేసుకున్న‌ది. క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌గ‌తిలో ఉంద‌ని, మార్కెట్‌లో సానుకూల వాతావ‌రణం నెల‌కొన్న‌ద‌ని హోండా కార్స్ ఇండియా వ్యాఖ్యానించింది. మ‌రో దేశీయ ఆటో దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా సైతం నాలుగు శాతం ప్ర‌గ‌తిని న‌మోదు చేసింది. గ‌త నెల‌లో 20,634 కార్ల‌ను విక్ర‌యించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo