ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఫుల్.. ఎందుకంటే?!

ముంబై: ఫెస్టివ్ సీజన్, జనవరి నుంచి ధరలు పెరుగుతాయన్న సంకేతాల మధ్య 2020 డిసెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో సానుకూల పురోగతి కనిపించింది. గత డిసెంబర్ నెలలో తొలిసారిగా ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ పెరిగింది.
2019తో పోలిస్తే రీజనల్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయాల (ఆర్టీవో) వద్ద వాహనాల రిజిస్ట్రేషన్ ప్రకారం 11 శాతం వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 24 శాతం గ్రోత్ కనిపిస్తే, ట్రాక్టర్ల విక్రయంలో 35 శాతంగా నమోదైంది.
కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత టూ వీలర్ విక్రయాల్లో సానుకూలత నమోదైంది. 2019తో పోలిస్తే 2020లో 12 శాతం టూవీలర్ వాహనాల విక్రయాలు పెరిగాయి. అయితే త్రీ వీలర్స్ సేల్స్ 53 శాతం, వాణిజ్య వాహనాల విక్రయాలు 14 శాతం పడిపోయాయి.
పంటల దిగుబడులు మెరుగ్గా ఉండటంతో టూవీలర్ సెగ్మెంట్ వాహనాల విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్స్, టూవీలర్స్ సెగ్మెంట్స్‌లో నూతన ఆవిష్కరణలు కూడా దీనికి కారనం. జనవరి నుంచి ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో వినియోగదారులు వాహనాల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారని ఫాడా అధ్యక్షుడు వింకేష్ గులాటీ అభిప్రాయ పడ్డారు.
2020లో ట్రాక్టర్ల కొనుగోళ్లలో అసాధారణ గ్రోత్ నమోదైంది. ఈ పరిస్థితుల్లో దేశీయ డిమాండ్‌ను అందుకునేందుకు దేశంలోని ట్రాక్టర్ల తయారీ కంపెనీలు విదేశాలకు ఎగుమతుల్లో కోత విధించాయి. ట్రాక్టర్లకు రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ నెలకొంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.