శుక్రవారం 07 ఆగస్టు 2020
Business - Jul 09, 2020 , 19:24:12

చైనా బ్యాంకుల్లో భారీ లావాదేవీల‌పై నిషేధం!

చైనా బ్యాంకుల్లో భారీ లావాదేవీల‌పై నిషేధం!

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. బ్యాడ్ లోన్స్ పెరిగిపోయాయి. బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు త‌రిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో చైనా బ్యాంకుల్లో భారీస్థాయి లావాదేవీల‌పై అక్క‌డి ప్ర‌భుత్వం నిషేధం విధించింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పైల‌ట్ ప్రాజెక్టుగా హెబీ ప్రావిన్స్‌లో ఈ నిషేధాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. దీని ప్రకారం వ్య‌క్తిగ‌త‌, బిజినెస్ ఖాతాదారులు ఎవరైనా పెద్దమొత్తంలో న‌గ‌దును ఉపసంహరించుకోవాలన్నా లేదా డిపాజిట్ చేయాలన్నా ముందుగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకు స‌మాచారం ఇవ్వాల్సి ఉంటుంది. 

వ్య‌క్తిగ‌త బ్యాంకు ఖాతాదారులు నిర్వ‌హించే లావాదేవీ విలువ‌ 1,00,000 యువాన్లు దాటితే ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రాంతాన్ని బ‌ట్టి ఈ ప‌రిమితి 3,00,000 యువాన్ల వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉన్న‌ది. బిజినెస్ ఖాతాదారులు 5,00,000 యువాన్ల‌కు మించి లావాదేవీలు జ‌రిపితే స‌మాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో బ్యాడ్‌లోన్స్ పెరిగిపోయాయ‌నే ప్ర‌చారంతో ప్ర‌జ‌లు పెద్ద మొత్తంలో న‌గ‌దు ఉప‌సంహరించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో భారీ లావాదేవీల‌పై పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఆంక్ష‌లు విధించిన‌ట్లు తెలుస్తున్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo