e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home News 82% చిన్న వ్యాపారాలు గల్లంతే.. ఇదీ కొవిడ్‌-19 ఎఫెక్ట్

82% చిన్న వ్యాపారాలు గల్లంతే.. ఇదీ కొవిడ్‌-19 ఎఫెక్ట్

82% చిన్న వ్యాపారాలు గల్లంతే.. ఇదీ కొవిడ్‌-19 ఎఫెక్ట్

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో చిన్న వ్యాపారాలు కోలుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని, మాన్యుఫాక్చ‌రింగ్ సెక్టార్ మ‌రింత చిక్కుల్లో ప‌డుతుంద‌ని తెలుస్తున్న‌ది. 82 శాతం చిన్న వ్యాపారాలు దెబ్బ తినే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఏటా రూ.100-250 కోట్ల వార్షిక ట‌ర్నోవ‌ర్ గ‌ల 250కి పైగా మాన్యుఫాక్చ‌రింగ్‌, స‌ర్వీస్ సెక్టార్ సంస్థ‌ల‌ ప‌రిస్థితిపై ఆయా కంపెనీల ప్ర‌తినిధుల‌తో డాన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ అనే సంస్థ సంప్ర‌దింపులు జ‌రిపింది. వీరిలో 70 శాతం అంటే మూడింట రెండొంతుల కంపెనీలు, వ్యాపార సంస్థ‌ల ప్ర‌తినిధులు క‌రోనాకు ముందు ఉన్న డిమాండ్‌ను అందుకోవాలంటే ఏడాది ప‌డుతుంద‌న్నారు. ‌

కొవిడ్‌-19 వ‌ల్ల దారుణంగా దెబ్బ తిన్న దేశాల్లో భార‌త్ ఒక‌టి. లాక్‌డౌన్ విధించిన త‌ర్వాత త‌గ్గిన‌ట్లు క‌నిపించిన క‌రోనా కేసులు దేశంలో మ‌ళ్లీ పెర‌గ‌డంతో ఎకాన‌మీపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది. డిమాండ్ త‌గ్గుముఖం ప‌డుతుంది. ఆదాయం క‌ల్ప‌న ప‌డిపోతుంది.

ఏడు మెట్రో న‌గ‌రాల‌పై ఫోక‌స్ చేస్తూ సాగిన స‌ర్వేలో 60 శాతం సంస్థ‌లు ప్ర‌భుత్వం త‌మ‌కు మ‌ద్ద‌తుగా, బాస‌ట‌గా నిలిచేందుకు కొన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఆశాభావంతో ఉన్నట్లు తెలిపాయి.

చిన్న వ్యాపార సంస్థ‌ల ముంగిట‌ మూడు ప్ర‌ధాన స‌వాళ్లు నిలిచాయి. వాటిలో మార్కెట్ యాక్సెస్ ప‌డిపోతుంద‌ని 42 శాతం, ఓవ‌రాల్ ప్రొడ‌క్టివిటీ ప‌త‌నం అవుతుంద‌ని 37 శాతం, న‌గ‌దు ల‌భ్య‌త స‌మ‌స్య‌గా మారుతుంద‌ని 34 శాతం సంస్థ‌లు ఆందోళ‌న చెందుతున్నాయి.

గ‌తేడాది ఏప్రిల్‌లో లాక్‌డౌన్ విధించిన‌ప్పుడు సుమారు 95 శాతం సంస్థ‌లు వాణిజ్య‌ప‌రంగా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాయి. ఆగ‌స్టు నాటికి ద‌శ‌ల‌వారీగా లాక్ డౌన్‌ను అన్‌లాక్ చేసినా 70 శాతం వ్యాపార లావాదేవీల్లో అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నాటికి అది 40 శాతానికి దిగి వ‌చ్చింది.

చిన్న వ్యాపార సంస్థ‌ల‌కు మార్కెట్ యాక్సెస్‌, మెరుగైన రుణ ప‌ర‌ప‌తి ప్ర‌ధాన స‌వాళ్లుగా నిలుస్తాయి. మెరుగైన రుణ ప‌ర‌ప‌తి వ‌స‌తి క‌ల్పించాల‌ని మెజారిటీ సంస్థ‌లు అభిప్రాయ ప‌డుతున్నాయి. క‌రోనా త‌ర్వాత సాయం అందించాల‌ని 59 శాతం సంస్థ‌లు కోరుతున్నాయి. మెరుగైన మార్కెటింగ్ కావాల‌ని 48 శాతం, టెక్నాల‌జీ అడాప్ష‌న్ కావాల‌ని 35 శాతం వ్యాపారులు కోరుతున్నారు.

దేశంలోని చిన్న వ్యాపారాల రిక‌వ‌రీపైనే భార‌త వాణిజ్య సంస్థ‌ల రిక‌వ‌రీ ఆధార‌ప‌డి ఉంటుంద‌ని డాన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ గ్లోబ‌ల్ చీఫ్ ఎక‌న‌మిస్ట్ అరుణ్ సింగ్ తేల్చేశారు.

ఇవి కూడా చదవండి:

క‌రోనా కేసుల్లో వ‌ర‌ల్డ్ రికార్డు..

18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్‌

డోంట్‌ వర్రీ..ఆన్‌ లైన్లో ఆక్సిజన్‌ మిషన్లు

అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్‌ సిలిండర్ల సీజ్

ర‌ష్యా తురుపుముక్క లెనిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

హాస్పిటల్‌ నుంచి 1,710 కొవిడ్‌ వ్యాక్సిన్లు మాయం

వ‌ణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్‌.. ఎందుకంత డేంజ‌ర్‌? ఏం చేయాలి?

సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..

నెగెటివ్‌ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్‌కే

‘ప్రాణ’గండం!! .. ఊపిరాడని ఉత్తరాది

దేశంలో ట్రిపుల్‌ మ్యుటెంట్‌ స్ట్రెయిన్‌


కొవిషీల్డ్ ధరల్లో తేడాలెందుకు? అందరికీ వ్యాక్సినేషన్ అక్కర్లేదా?!

అస‌లు ఓ ప్లాన్ ఉందా.. ఆక్సిజ‌న్‌, వ్యాక్సినేష‌న్‌పై కేంద్రాన్ని నిల‌దీసిన సుప్రీం

వ్యాక్సిన్ విధానాన్ని త‌ప్పుప‌ట్టిన సోనియా గాంధీ

తులం బంగారం 4 నెల‌ల్లో రూ.50వేలకు.. ప‌రిస్థితి విష‌మిస్తే.. మరింత పైపైకి!

Advertisement
82% చిన్న వ్యాపారాలు గల్లంతే.. ఇదీ కొవిడ్‌-19 ఎఫెక్ట్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement