ఆవు పేడతో పెయింట్

- నేడు మార్కెట్లోప్రవేశపెట్టనున్న కేవీఐసీ
న్యూఢిల్లీ, జనవరి 11: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ).. ‘ఖాదీ ప్రాకృతిక్ పెయింట్' పేరుతో విష పదార్థాల్లేని పర్యావరణ అనుకూల (ఎకో ఫ్రెండ్లీ) పెయింట్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ప్రధానంగా ఆవు పేడతో తయారయ్యే ఈ పెయింట్‌కు ఎలాంటి వాసన ఉండదు. ఇలాంటి పెయింట్ అందుబాటులోకి రానుండటం ఇదే తొలిసారి. చాలా తక్కువ ధరలో లభించే ఈ పెయింట్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఇప్పటికే సర్టిఫై చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఈ పెయింట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. డిస్టెంపర్, ప్లాస్టిక్ ఎమల్షన్ రూపాల్లో లభించే ఖాదీ ప్రాకృతిక్ పెయింట్‌లో సీసం, పాదరసం, క్రోమియం, ఆర్సెనిక్, కాడ్మియం లాంటి భార లోహాలేమీ ఉండవని కేవీఐసీ సోమవారం ఓ ప్రకటనలో వివరించింది.
తాజావార్తలు
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం
- బీపీసీఎల్ ఫర్ సేల్: నుమలీగఢ్ రిఫైనరీతో షురూ..!
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!