బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 26, 2020 , 00:31:50

ఆనంద్‌ మహీంద్రా, వేణు శ్రీనివాసన్‌లకు పద్మభూషణ్‌

ఆనంద్‌ మహీంద్రా, వేణు శ్రీనివాసన్‌లకు పద్మభూషణ్‌

న్యూఢిల్లీ, జనవరి 25: మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టీవీఎస్‌ గ్రూప్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌లను ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ అవార్డులు వరించాయి. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం 141 పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో 7 పద్మవిభూషణ్‌, 16 పద్మభూషణ్‌, 118 పద్మశ్రీ అవార్డులున్నాయి. వాణిజ్య, పరిశ్రమల విభాగానికి చెందిన మొత్తం 11 మందికి పద్మాలు దక్కగా, మహారాష్ట్ర నుంచి ఆనంద్‌ మహీంద్రా, తమిళనాడు నుంచి వేణు శ్రీనివాసన్‌ పద్మభూషణ్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. మిగతా తొమ్మిది మందికి పద్మశ్రీ అవార్డులు రాగా, వారిలో జై ప్రకాశ్‌ అగర్వాల్‌ (ఢిల్లీ), సంజీవ్‌ బిఖ్‌చందానీ (ఉత్తరప్రదేశ్‌), గఫూర్‌భాయ్‌ ఎం బిలఖియా(గుజరాత్‌), చెవాంగ్‌ మోతుప్‌ గోబ (లడఖ్‌), భరత్‌ గోయెంకా (కర్ణాటక), నీమ్‌నాథ్‌ జైన్‌ (మధ్యప్రదేశ్‌), విజయ్‌ సంకేశ్వర్‌ (కర్నాటక), రమేశ్‌ టెక్‌చంద్‌ వాదవాని (అమెరికా), ప్రేమ్‌ వాత్స (కెనడా) ఉన్నారు. వీరిలో సంజీవ్‌ బిఖ్‌చందానీ నౌకరీ.కామ్‌ వ్యవస్థాపక వైస్‌ చైర్మన్‌.
logo