బుధవారం 03 జూన్ 2020
Business - Apr 27, 2020 , 15:37:59

ఆర్బీఐది మంచి నిర్ణ‌యంః చిదంబ‌రం

ఆర్బీఐది మంచి నిర్ణ‌యంః చిదంబ‌రం

లాక్‌డౌన్ కార‌ణంగా దెబ్బ‌తిన్న మ్యూచువ‌ల్ ఫండ్స్ ప‌రిశ్ర‌మ‌కు ద్ర‌వ్య లభ్య‌త కోసం రిజ‌ర్వు బ్యాంకు రూ.50000 కోట్ల ప్యాకేజీ ప్ర‌క‌టించ‌టాన్ని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబ‌రం స్వాగ‌తించారు. మ్యూచువ‌ల్ ఫండ్స్ విభాగంలో నెల‌కొన్న ఆందోళ‌న‌ల‌ను ఈ ద్ర‌వ్య ప్యాకేజీ తీర్చ‌గ‌ల‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌ముఖ పెట్టుబ‌డి సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్‌ట‌న్ భార‌త్‌లోని ఆరు ఫండ్స్‌లో త‌న పెట్టుబ‌డిని కొద్దిరోజుల క్రితం స్తంభింపజేసింది. దాంతో దేశీయ పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న‌లో ప‌డ్డారు. ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు ఆర్బీఐ ద్ర‌వ్య ప్యాకేజీని ప్ర‌క‌టించింది. 


logo