సోమవారం 08 మార్చి 2021
Business - Feb 03, 2021 , 20:04:37

మూడొంతులు కొత్త కొల్వుల‌పై ఫోక‌స్‌.. ఆన్‌లైన్ లెర్నింగ్ కీల‌క‌మా?!

మూడొంతులు కొత్త కొల్వుల‌పై ఫోక‌స్‌.. ఆన్‌లైన్ లెర్నింగ్ కీల‌క‌మా?!

న్యూఢిల్లీ: క‌రోనా వేళ ప్రైవేట్ రంగంలో కొన‌సాగుతున్న అనిశ్చితి.. తీవ్ర పోటీత‌త్వం ‌.. భార‌తీయ నిపుణుల్ని ఆలోచింప‌జేస్తున్నాయి. ప్ర‌తి న‌లుగురు నిపుణుల్లో ముగ్గురు వ‌చ్చే ఏడాదిలోగా కొత్త కొలువుల కోసం, ఉద్యోగాల మార్పుపై ఫోక‌స్ చేశార‌ని సోష‌ల్ మీడియా ప్లాట్‌పాం లింక్డ్ ఇన్ తాజా అధ్య‌య‌నంలో తేలింది. ప్రతి ఐదుగురిలో ఇద్ద‌రు వ్య‌క్తులు ఆన్‌లైన్ లెర్నింగ్‌.. 2021 నియామ‌కాల్లో కీల‌కం కానున్న‌ద‌ని భావిస్తున్నారు. దేశంలోని 15 గ్రూపుల‌కు చెందిన 1,016 మంది భార‌తీయ నిపుణుల నుంచి లింక్డ్ ఇన్ అభిప్రాయాలు సేక‌రించింది. అయితే, స‌ర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది త‌మ ఫ్యూచ‌ర్ గురించి కాన్ఫిడెంట్‌గా ఉన్నార‌ని తేలింది. 

2019తో పోలుస్తూ దేశంలోని టాప్ 15 జాబ్ గ్రూప్‌ల్లో ప‌రిస్థితిపై.. జాబ్స్ ఆన్ ది రైజ్ అనే పేరుతో లింక్డ్ ఇన్ ఓ నివేదిక వెల్ల‌డించింది. ఫ్రీలాన్స్ కంటెంట్ క్రియేట‌ర్లు, సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మార్కెటింగ్‌, బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ సేల్స్‌, స్పెష‌లైజ్డ్ ఇంజినీరింగ్ విబాగాల్లో కొలువుల కోసం నిపుణుల్లో ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంది. ఫైనాన్స్‌, ఎడ్యుకేష‌న్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, ఈ-కామ‌ర్స్‌, సైబ‌ర్ సెక్యూరిటీ అనుబంధ ఉద్యోగాలు టాప్‌-10 జాబితాలో ఉన్నాయి. డేటా సైన్స్‌, హెల్త్‌కేర్‌,హ్యూమ‌న్ రీసోర్సెస్‌, యూజ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ అండ్ క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ వంటి విభాగాల్లోనూ గ్రోత్ ఉంటుంద‌ని లింక్డ్ ఇన్ నివేదించింది. 

లింక్డ్ఇన్ టాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూష‌న్స్ (ఇండియా) రుచీ ఆనంద్ మాట్లాడుతూ.. 2020లో జాబ్స్ మార్కెట్‌లో స‌మూల మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ఎకో సిస్ట‌మ్‌లో ప‌నిచేయ‌డం పెరిగిపోయింద‌న్నారు. టెక్నిక‌ల్‌, నాన్ టెక్నిక‌ల్ రంగాల ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యోగాలు డిజిట‌ల్ ప‌రివ‌ర్త‌న చెందుతున్నాయ‌ని రుచీ ఆనంద్ చెప్పారు. అన్ని రంగాల ప‌రిశ్ర‌మ‌ల ఉద్యోగులు, నిపుణులు నూత‌న ర‌కం స‌హ‌కార ధోర‌ణితోపాటు రిమోట్ వ‌ర్క్ క‌ల్చ‌ర్ దిశ‌గా అడుగులేస్తున్నాయ‌న్నారు. ఆడియ‌న్స్ బిల్డ‌ర్స్‌, కంటెంట్ క్రియేట‌ర్లు వివిధ బ్రాండ్ల‌కు కీల‌కంగా మారాయ‌ని తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo