శనివారం 30 మే 2020
Business - Feb 07, 2020 , 23:47:24

మా ప్లాంట్‌ ఎక్కడికీ వెళ్లదు: కియా ఎండీ

మా ప్లాంట్‌ ఎక్కడికీ వెళ్లదు:  కియా ఎండీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కియా మోటర్స్‌ ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వస్తున్న వార్తలకు ఆ కంపెనీ ఎండీ తెరదించారు. అనంతపురం జిల్లాలోనే తమ ప్లాంట్‌ను కొనసాగిస్తామని, అక్కడి నుంచే ప్రపంచస్థాయి వాహనాలను తయారుచేస్తామని స్పష్టం చేశారు. కియా ప్లాం ట్‌ను అనంతపురం జిల్లా నుంచి తరలించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు ‘రాయిటర్స్‌' వార్తా సంస్థ ప్రచురించిన కథనం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ మేరకు కియా ఎండీ పంపిన సందేశాన్ని ఆ సంస్థ ప్రతినిధి శుక్రవారం చదివి వినిపించారు. ఏపీ నుంచి తమ ప్లాంట్‌ను ఎక్కడికీ తరలించాలనుకోవడం లేదని ఆయన తెలిపారు.


logo