ఆదివారం 12 జూలై 2020
Business - Jun 02, 2020 , 05:17:45

టీ హబ్‌తో ఒప్పో జోడీ

టీ హబ్‌తో  ఒప్పో జోడీ

హైదరాబాద్ : స్టార్టప్‌లను మరింతగా ప్రోత్సహించేందుకుగాను ప్రముఖ చైనా సెల్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో టీ హబ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని టీ హబ్‌  అధికారికంగా ప్రకటించింది. కృత్రిమ మేధస్సు, 5జీ, బ్యాటరీ, కెమెరా, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, గేమింగ్‌ రంగాల్లో టీహబ్‌-ఒప్పో కలిసి మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు కృషి చేయనున్నాయి. ఎంపికచేసిన స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్‌ సౌకర్యం, సాంకేతిక సౌకర్యం కల్పించనున్నాయి. ఈ ఒప్పందం స్టార్టప్‌లను అభివృద్ధిచేయాలనే తమ ఉద్దేశానికి అనుగుణంగా ఉందని ఒప్పో ఉపాధ్యక్షుడు తస్లీమ్‌ ఆరిఫ్‌ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక సంస్థలు ఎంతో కీలకమైనవని ఆయన తెలిపారు. ఒప్పోతో తమ ఒప్పందం అనేక విధాలుగా స్టార్టప్‌లకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని టీ హబ్‌ సీఈవో రవి నారాయణ్‌ తెలిపారు.


logo