బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 14, 2020 , 01:10:55

ఒప్పో నుంచి ఎఫ్15 స్మార్ట్‌ఫోన్

ఒప్పో నుంచి ఎఫ్15 స్మార్ట్‌ఫోన్

హైదరాబాద్, జనవరి 13: చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో..దేశీయ మార్కెట్లోకి ఎఫ్ సిరీస్‌లో మరో మోడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఎఫ్15 పేరు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 16 నుంచి రిటైల్ మార్కెట్లో లభించనున్నది. 6.4 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లో ఆక్టాకోర్ ప్రాసెసర్, 48+8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమొరీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ప్రాడక్ట్ మేనేజర్ రిషబ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఎఫ్ సిరీస్‌లో భాగంగా విడుదల చేయనున్న ఈ ఐదో మోడల్ యువతను ఆకట్టుకునే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడళ్ల కంటే 14 శాతం తక్కువ మందం, 12 శాతం తక్కువ బరువుతో ఈ మొబైల్‌ను హైదరాబాద్‌లో ఉన్న ఆర్ అండ్ డీ కేంద్రంలోనే డిజైన్ చేసినట్లు చెప్పారు. ఈ మొబైల్‌తో ఇతర మొబైళ్లను కూడా చార్జింగ్ చేసుకునే అవకాశం కూడా ఉన్నదన్నారు. గతేడాదిలో హైదరాబాద్‌లో 57 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థ..మార్కెట్ వాటా 12.4 శాతంగా ఉన్నది. 


logo