సోమవారం 08 మార్చి 2021
Business - Nov 19, 2020 , 01:28:42

రాష్ట్రంలో ఊర్జా ప్లాంట్‌!

రాష్ట్రంలో ఊర్జా ప్లాంట్‌!

రూ.100 కోట్లతో ఏర్పాటు 

రెండేండ్లలో అందుబాటులోకి యూనిట్‌

హైదరాబాద్‌: ఊర్జా క్లీన్‌టెక్‌ హైదరాబాద్‌లో కొత్త ప్లాంట్‌ను నెలకొల్పడానికి సిద్ధమవుతున్నది.  ఫ్యాబ్‌సిటీ దగ్గరలో రూ. 50 కోట్ల నుంచి రూ.100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్‌.. వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వ్యవస్థాపక ఎండీ మధుసూధన్‌ రావు తెలిపారు. ప్రస్తుతం చర్లపల్లి యూనిట్‌లో కొన్ని విడిభాగాలను తయారు చేసున్నామని, మరికొ న్నింటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. తాము తయారు చేసే పరికరాల వినిమయంతో విద్యుత్‌ బిల్లులను 30 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గించుకోవచ్చని తెలిపారు. కాగా, ప్రస్తుతం భారత్‌లో 25 గిగావాట్లుగా ఉన్న విద్యుత్‌ వినిమయం వచ్చే 30 ఏండ్లలో 850 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఊర్జా క్లీన్‌టెక్‌ ఉత్పత్తులకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ కనిపించనున్నది.

VIDEOS

logo