శనివారం 30 మే 2020
Business - Mar 31, 2020 , 22:37:30

విరాళాల వెల్లువ

విరాళాల వెల్లువ

-పీఎం-కేర్స్‌ ఫండ్‌కు కార్పొరేట్ల ఉదార సాయం 

-రూ.1,031 కోట్లిచ్చిన ఓఎన్జీసీ, ఐవోసీ తదితర సంస్థలు 

న్యూఢిల్లీ, మార్చి 31: పీఎం-కేర్స్‌ ఫండ్‌కు కార్పొరేట్ల విరాళాలు భారీగా కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ, ఐవోసీ ఇతర ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రధాన మంత్రి కేర్స్‌కు రూ. 1,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చా యి. ఓఎన్జీసీ రూ.300 కోట్లు, ఐవోసీ రూ.225 కోట్లు, బీపీసీఎల్‌ రూ. 175 కోట్లు, హెచ్‌పీసీఎల్‌ రూ.120 కోట్లు, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌ రూ. 100 కోట్లు, గెయిల్‌ రూ.50 కోట్లు, ఆయిల్‌ ఇండియా రూ.38 కోట్లు చొప్పున ఇచ్చాయి. కాగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల భార్య అనుపమ రూ. 2 కోట్లు ఇచ్చారు. పలు సంస్థలు ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయ నిధికీ విరాళాలను అందించాయి.

ఎవరు ఎంతెంత?

కంపెనీ (రూ.కోట్లలో)

పీఎఫ్‌సీ         200

ఆర్‌ఈసీ         150

ఎన్‌ఎండీసీ 150

ఎల్‌ఐసీ         105

ఎస్బీఐ ఉద్యోగులు 100

భారతీ ఎయిర్‌టెల్‌ 100

పిరమల్‌ గ్రూప్‌ 25

జేఎస్పీఎల్‌         25

కల్యాణి గ్రూప్‌         25

దాల్మియా గ్రూప్‌ 25

ఇఫ్కో                 25

షియామీ                15 

సీఎస్‌డీఎల్‌ గ్రూప్‌ 6.82


logo