బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jun 30, 2020 , 19:56:38

సరసమైన ధరలో వన్‌ప్లస్‌ ఫోన్‌.. ఇండియాకే మొదట..

సరసమైన ధరలో వన్‌ప్లస్‌ ఫోన్‌.. ఇండియాకే మొదట..

న్యూ ఢిల్లీ: కొన్ని నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు చైనా కంపెనీ వన్‌ప్లస్‌ తెరదించింది. తమ సంస్థ నుంచి వస్తున్న అతి సరసమైన ధరలో దొరికే వన్‌ప్లస్‌ నార్డ్‌ ఫోన్‌ను మొదట ఇండియా, యూరోప్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ శ్రేణి తమ సంస్థ కొత్త గ్లోబల్‌ బిజినెస్‌ స్ట్రాటజీని అనుసరిస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా అందుబాటు ధరల్లో ఇంకొన్ని ఫోన్లను తీసుకొస్తామని వివరించింది. అలాగే, దీనికి సంబంధించి వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను కూడా తీసుకుంటామని తెలిపింది. 

‘ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ శ్రేణిని ప్రారంభించడం తమ కంపెనీ చరిత్రలోనే కొత్త అధ్యయానికి నాంది పలికింది. ప్రపంచానికి మంచి సాంకేతికతతో కూడిన ఉత్పత్తులను అందించేందుకు మేమెప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఇది మాకు చాలెంజింగ్‌తో కూడుకున్న పని.’ అని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో పీట్‌ లా పేర్కొన్నారు. ‘మా ప్రధాన ఉత్పత్తుల గురించి మేం చాలా గర్వపడుతున్నాం. ఈ కొత్త ఉత్పత్తి శ్రేణి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కువ మంది వినియోగదారులతో వన్‌ప్లస్ అనుభవాన్ని పంచుకోబోతున్నందుకు సంతోషిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన తర్వాత ఉత్తర అమెరికాలో అత్యంత పరిమితమైన బీటా ప్రోగ్రామ్ ద్వారా దీన్ని వాడే అవకాశం కొంతమందికి లభిస్తుందని తెలిపారు. ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ అప్‌డేట్‌ కోసం భారతీయులు అమెజాన్‌.ఇన్‌లో లాగిన్‌ అయి నోటిఫై మి బటన్‌ను క్లిక్‌ చేయాలని సూచించారు.  logo