ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 22, 2020 , 08:00:05

‘రెండు ఎయిర్‌లైన్స్‌ మూతపడొచ్చు’

‘రెండు ఎయిర్‌లైన్స్‌ మూతపడొచ్చు’

ముంబై/న్యూయార్క్‌: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తమ సిబ్బందిలో 10 శాతం మందిని తొలిగించాలని తీసుకొన్న నిర్ణయం బాధాకరమైన ప్రక్రియలో ఆరంభం మాత్రమేనని క్యాపా (సెంటర్‌ ఫర్‌ ఏషియా పసిఫిక్‌ ఏవియేషన్‌) ఇండియా పేర్కొన్నది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఒకటి లేదా రెండు విమానయాన సంస్థలు మూతపడవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో థర్డ్‌పార్టీ ఇన్వెస్టర్లు ఏ విమానయాన సంస్థలోనూ పెట్టుబడులు పెట్టకపోవచ్చని, ప్రమోటర్ల నుంచి నిధులను సమకూర్చుకోవడమే ఏకైక మార్గమని క్యాపా అభిప్రాయపడింది. 

ట్రూజెట్‌ జీతాల్లో కోత

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన విమానయాన సంస్థ ట్రూజెట్‌ తమ ఉద్యోగుల జీతాల్లో కనీసం 50% కోత విధించాలని నిర్ణయించింది.


logo